స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసి బస్సు సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు

9/19/2024 9:28:15 PM

ఎన్ఏడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 19:
రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం నాడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మద్దిలపాలెం, ఎన్.ఎస్.టి.ఎల్, రేవిడి, , పద్మనాభం, మారికవలస, తగరపువలస, ఇసుకతోట, పెందుర్తి, వుడా పార్క్ ప్రాంతాలలో స్కూలు, కాలేజీ బస్సుల పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వివిధ రకాల నిబంధనలను ఉల్లంఘించిన 5 బస్సుల పై కేసులు నమోదు చేయడం జరిగిందని, 1 బస్సు సీజు చేయడం జరిగిందని ఉప రవాణా కమీషనర్ రాజారత్నం అన్నారు. 13వ తేది నుండి 19వ తేది వరకు 100 కేసులు నమోదు చేసి 10 బస్సులను సీజు చేయడం జరిగిందని, అలాగే 46 ఆటోల పై కేసులు నమోదు చేసి 5 ఆటోలను సీజు చేయడం జరిగిందని తెలిపారు. స్కూలు యాజమాన్యాలు, సిబ్బంది ఎప్పుడు అప్రమత్తంగా ఉండి, ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలి అని లేకుంటే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఉప రవాణా కమీషనర్ తెలిపారు. ఈ తనిఖీలలో మోటారు వాహన తనిఖీ అధికార్లు, బి. బాలాజీ రావు, రాజా రావు ఏ.యం.వి.ఐ లు అనిల్ కుమార్, సుమన్ కుమార్, దుర్గా ప్రసాద్, పార్వతి, తదితరులు పాల్గున్నారు.

Name*
Email*
Comment*