అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లుకు ఆదేశాలు

9/19/2024 9:42:03 PM

అమలాపురం, ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ :19 
ఉచిత ఇసుక పాలసీ ని ఎటువంటి ఫిర్యాదుల కు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా యూజర్ ఫ్రెండ్లీ గవర్న మెంట్ మాదిరిగా అమ లు చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లుకు సూచించారు. గురువారం అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇసుక నిర్వహణ వ్యవస్థపై నూతనంగా రూపొందించిన ఆన్లైన్ వెబ్ పోర్టల్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీలో కేవలం లోడింగ్, ఇసుక త్రవ్వకాలు, ఖర్చు రవా ణా ఖర్చులు మాత్రమే వసూలు చేయడం జరుగుతోoదన్నారు. ఆధునిక సాంకేతికతను జోడించి సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలు ఐవిఆ ర్ఎస్ జిపిఎస్ కోఆర్డినేట్స్ ట్రాకింగ్ పర్యవేక్షణ వ్యవస్థల ను పటిష్టం చేయడం జరిగిందని అదేవిధంగా వినియోగ దారులకు ఆన్లైన్లో నేరుగా బుక్ చేసుకునే అవకాశం ఉన్నదని ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం తెలియనప్పుడు సమీప గ్రామ సచివాలయంలో ఇసుకను బుక్ చేసుకోవ చ్చని ఆయన తెలిపారు. రోజువారీగా యార్డులు రీచ్ లలో ఎంత మేరకు ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందో ముందుగా ఆన్లైన్లో పొందుపర చడం జరుగుతుందని దానిలో 30% ఇసుకను గ్రామ సచివాలయం ద్వారా బుక్ చేసుకునే వెసులు బాటు ఉంద న్నారు. అదేవిధంగా వినియోగదారులు నేరుగా ఆన్లైన్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారన్నారు. ఉచిత ఇసుక నిర్వహణ వ్యవస్థను అత్యంత పారదర్శకంగా యూజర్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ విధానం లో అమలు చేస్తూ ఏ ఒక్క ఫిర్యాదు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాం గం పై ఉందని ఆయన స్పష్టం చేశారు అక్టోబర్ 15 నుండి పూర్తిస్థాయిలో యార్డులలో రీచ్ లలో ఇసుక అందుబాటులోకి రానున్నదని డిమాండ్ సరఫరా సమతుల్యత పాటిస్తూ ఎక్కడ ఇసుక కొరత మాట వినపడ కుండా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. నిజమైన వినియో గదారుల ప్రయోజనాల ను కాపాడే దిశగా కేవలం నిర్వహణ రవాణా లోడిం గ్ చార్జీలు చెల్లించే ఉచిత ఇసుక నిర్వ హణ వ్యవస్థ ప్రవేశ పెట్టడం జరిగింద న్నారు.  ప్రత్యక్షంగా  పరోక్షంగా చాలామందికి ఉపాధి కల్పించే నిర్మాణ రంగానికి ఇసుక ప్రాథమిక అవసరమని ఇసుక ధర ను సహేతుకమైన నియం త్రణలో ఉంచకపోతే, నిరుద్యోగం, భవన నిర్మాణ కార్యకలాపాలకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయన్నారు. అందు వల్ల ఇసుకను వినియోగ దారులకు సరసమైన ధరకు అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్నదన్నారు. సాంకేతికత ఆధారితంగా విని యోగదారు స్నేహపూర్వ కంగా  పారదర్శకంగా, బుకింగ్ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి సవరించిన ఉచిత ఇసుక పాలసీ మార్గదర్శకాలను ప్రవేశపెట్టిందన్నారు. వినియోగదారులకు ఇసుక, రవాణాను సులభతరం చేయడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం. విజిలెన్స్ మెకానిజం పటిష్టం చేయడం జరిగిందన్నారు. ఆన్‌లైన్‌ లో అన్ని ప్రక్రియ లను సులభతరం చేయడానికి ఆన్‌లైన్ పోర్టల్ ఏపీ ఇసుక నిర్వహణ వ్యవస్థ అభివృద్ధి చేయబడింద న్నారు. ఇసుక నిర్వహణ వ్యవస్థ అనేది ఉచిత ఇసుక విధానంలో భాగంగా గనులు & భూగర్భ శాఖ  నేతృత్వం లోని ఉచిత ఇసుక పంపిణీకి ప్రభుత్వ నిబద్ధతకు మద్దతునిస్తూ, నిర్వహణ ఖర్చులు, చట్టబద్ధమైన రుసుములకు పరిమిత మైన ఛార్జీలతో, ప్రజలకు తక్కువ ధరకే ఇసుకను అందు బాటులో ఉంచేలా ఈ పోర్టల్ రూపొందించ బడిందన్నారు. స్టాక్ పాయింట్‌లలో ఇసుక లభ్యతపై నిజమైన సమాచారాన్ని అంది స్తుందన్నారు. వినియో గదారులను ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్ చేసుకోవ డానికి అనుమతిస్తుందని  ఇసుక డెలివరీల కోసం ట్రాకింగ్‌ను అందిస్తుందని, ఇసుక కార్యకలాపాల నిర్వహణకు సమర్థవం తమైన పారదర్శక ప్రక్రియ ను నిర్ధారిస్తుందన్నారు. వినియోగదారులకు  నిర్వహణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్రామాలలో వాగులు వంకలలో ఇసుకను ఉచితంగా ఎడ్ల బళ్ళు ట్రాక్టర్ల సహకారం తో తీసుకుని వెళ్లే అవ కాశం ఉందన్నారు. 2000 చదరపు అడుగుల లోపు గృహాన్ని నిర్మించుకునే వారు వ్యక్తిగత వినియోగ దారులని  వీరికి ఆన్లైన్లో బుక్ చేస్తే ఇసుక సరఫరా చేసే అవకాశం ఉందని, 2000 చదరపు అడుగులు పైబడి ప్రభుత్వ భవన నిర్మాణాలు, ఇతర భవనాలు నిర్మించేవారు బల్క్ వినియోగదారులు గా గుర్తిస్తారన్నారు. ఈ గుత్తేదారులు తాము నిర్మించే భవనాల ప్లాన్లు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సంబంధిత తాసిల్దారు క్షేత్రస్థాయి విచారణ చేపట్టి తదుపరి జిల్లా జాయింట్ కలెక్టర్ లాగిన్ కి చేరి  చేరుతుందని వారు అనుమతిస్తే ఇసుక  ఆన్లైన్లో బుక్ అవుతుంద ని ఆయన స్పష్టం చేశారు. 
ఎక్కడ కూడా ఇసుక అక్రమ రవాణాకు తావు లేకుండా సాంకేతికతను పూర్తిగా అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. వ్యక్తిగత వినియోగదారుడు గ్రామంలో భవనం నిర్మిస్తున్నది లేనిది, ప్లాన్ ప్రకారం సంబంధిత పంచాయతీ లేదా సచివాలయం సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. రవాణా వాహనాలకు లోడింగ్ కు జాప్యం లేకుండా వెయిటింగ్కు ఆస్కారం లేకుండా పటిష్టమైన విధానాన్ని అవలంబించాలని సూచించారు జిల్లా కలెక్టర్లు తమ డాష్ బోర్డులో రోజువారి ఇసుక నిర్వహణ వ్యవస్థకు సంబంధించి ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుని ఏ ఒక్క ఫిర్యా దు నమోదుకు ఆస్కారం లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. మోడరన్ వరల్డ్, రాపిడో మాదిరిగా పారదర్శకత తో ఇసుక నిర్వహణ వ్యవస్థ కొనసాగాలని సూచించారు. ఒక గంటలో ఎన్ని లారీలు లోడింగ్ అవుతాయో నిర్ధారించుకుని ఆ మేరకు ఇసుక నిల్వ ఆధారంగా వాహనాలను అనుమతిం చాలని సూచించారు. మొదటిగా బుక్ అయిన ఆర్డర్ కు అనుగుణంగానే ఫస్ట్  టు ఫస్ట్ సర్వ్ చేయా లని సూచించారు. జిల్లా గనుల శాఖ ద్వారా ద్వారా సప్లై పాయింట్‌ల యొక్క మాస్టర్ డేటా బేస్‌ను రూపొందించడం జరిగిందని ఏజెన్సీ ఎంప్యానెల్ చేయబడిన వాహనాలను సరఫరా పాయింట్‌లకు లింక్ చేస్తుందన్నారు. బుకింగ్ ఆర్డర్ వివరాలతో ముం దుగా ఆమోదించ బడిన ఏజెన్సీకి ఇసుక సరఫరా చేయబడుతుందన్నారు. ఎప్పుడైనా ఇసుక పారద ర్శకంగా లభిస్తుందని నమ్మకాన్ని ప్రజల్లో పెం పొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*