మండలాల వారీగా వాటర్ నమోదు కార్యక్రమం

9/19/2024 9:44:42 PM

- వాటర్ లిస్ట్ లో మరణించిన వారు పేర్లను తొలగింపు చేయాలి 

 ఆనందపురం: ఎక్స్ ప్రెస్ న్యూస్:  
ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల ఆనందపురం మండల పరిషత్తులో బూతులెవెల్ ఆఫీసర్లతో ఈరోజు సమావేశం అయింది. వాటర్ నమోదుకు సంబంధించి డోర్ టు డోర్ అండ్ మరణించిన వారి పేర్లు తొలగింపు క్లెయిమ్ పెండింగ్ మీద భీమిలి నియోజకవర్గం లో గల 348 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఆనందపురం మండల పరిషత్ సమావేశ మందిరంలో నియోజవర్గం బూతులు అధికారులను అందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భీమిలి పద్మనాభం రెవెన్యూ అధికారులు, అసిస్టెంట్ సిటీ పార్లర్ జీవీఎంసీ అధికారులు హాజరై నియోజకవర్గo, మండలాల వారీగా వెరిఫై అయినవి పద్మనాభం 42,167, ఆనందపురం 51,453, భీమిలి 1,026,60, విశాఖ రూరల్ 1,67,509 భీమిలి నియోజకవర్గం మొత్తం ఓటర్స్ సంఖ్య సుమారుగా 3 లక్షలు 60 వేలు మంది ఉన్నారని తెలిపారు. సర్వర్లో సాంకేతిక లోపాలు ఏమైనా ఉంటే సవరణ చేసుకునే విధంగా చేయాలని,  మరణించిన ఓటర్లు ను గడపగడపకు వెళ్లి వెంటనే తొలగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  తాసిల్దార్లు తాసిల్దార్లు భీమిలి రామారావు, పద్మనాభం ఆనందకుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జీవీఎంసీ శ్రీనివాసరావు, ఆనందపురం డిప్యూటీ తాసిల్దార్ రాజేష్, వీఆర్వోలు బూత్ లెవెల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*