దిగ్విజయంగా కూటమి వందరోజుల పాలన..!

9/19/2024 9:56:13 PM

కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్

 అనందపురం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 19
 కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేరుస్తూ దిగ్విజంగా 100 రోజుల పాలన సాగించిందని టిడిపి యువ నాయకుడు, వేములవలస  పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. తక్కువ రోజుల్లో ఎక్కువ ఫలితాలు ప్రజలకు చేరువయ్యేటట్లు చేసి సూపర్ సిక్స్ పథకాలతో పాలనలో సూపర్ సెంచరీ కొట్టింది అన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు హామీని రాబోవు దీపావళి పండగ నుంచి అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు  లకు కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగులకు మెగా డీఎస్సీ, ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు, పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి నిధులు, పేదలకు పెరిగిన పింఛన్లు, రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు  విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం అందరి దృష్టిని ఆకర్షించింది అన్నారు. గత ప్రభుత్వం వల్ల సంక్షోభంలో కూ రుకుపోయిన రాష్ట్రాన్ని 100 రోజుల్లో ఒక కొలిక్కి తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాని దేనని కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.

Name*
Email*
Comment*