సర్పంచ్ కి తెలియకుండా బిల్లులు చెల్లింపు, ఎంపీడీవోకు ఫిర్యాదు

9/19/2024 10:04:52 PM

 జి.సిగడాం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 19:
గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్  తమకు తెలియకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉపాధి హామి పనులు చేపట్టి, తీర్మానాలు లేకుండా బిల్లులు కూడా చెల్లింపులు చేశారని పాలఖండ్యాం సర్పంచ్ దారబోయిన రెయ్యమ్మ గురువారం ఎంపీడీఒకి పిర్యాదు చేశారు. సర్పంచ్ కి ప్రాధాన్యత ఉండాలని, పంచాయతీ రాజ్, ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్న క్రింది స్థాయి సిబ్బంది మాత్రం ఇష్టసారంగా వ్యవరిస్తున్నారు. గ్రామ సభ తీర్మానంలో గుర్తించని పలు పనులను ఎలా చేశారని సర్పంచ్ ఎంపీడీఓ కి ఫిర్యాదు లో తెలిపారు. తమకు తెలియజేయకుండా కోనేరు గుట్టు పై మొక్కలు, మర్రి అప్పారావు తోటలో ఫారం పాండ్ నిర్మించారని అలాగే  తీర్మానం లేకుండా పలు గృహాలకు ఉపాధి పధకం ద్వారా  బిల్లులు చెల్లించడం జరిగిందని అరోపించారు. ఈ విషయం సిబ్బంది కి అడగగా తమకు ఏమి తెలియదంటూ మాట దాటే వేశారని ఎంపీడీఒ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ విషయమై ఉపాధి వేతనదారులకు గృహా లబ్ధి దారులకు విచారించి బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఎంపీడీఒ స్పందిస్తూ గ్రామ స్థాయిలో విచారణ జరిపి తప్పుచేసిన వారిపై చర్యలు చేపడతామని తెలిపారు. ఈ విషయం పై సంబందించిన సిబ్బంది కి ప్రశ్నిస్తే మీకు నచ్చిన దగ్గర ఫిర్యాదు చేసుకోండి, ఎవరికి ఎలా చెప్పాలో మాకు తెలుసునని సమాధానం ఇస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.

Name*
Email*
Comment*