27న పీవోడబ్ల్యూ జిల్లా మహాసభలు

9/19/2024 10:37:50 PM

సోంపేట- ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 19
ప్రగతి శీల మహిళా సంఘము ఏడవ జిల్లా సభ ఈనెల, 27 న  శ్రీకాకుళం ఇల్లీసిపురంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో జరుప నున్నట్టు  ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) జిల్లా కార్యదర్శి పోతన పల్లి కుసుమ తెలిపారు. ఈ మేరకు పలాస మండలం మాకనపల్లిలో కరపత్రం అవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడు తుమహిళలపై సాగుతున్న హత్యలు , అత్యాచారాలు, పీడనలు , వివక్షతలు, శ్రమదోపిడికి.. వ్యతిరేకంగా పోరాడుదామన్నారు.  అర్థ శతాబ్ద కాలంగా ప్రజల కోసం, ప్రత్యేకంగా మహిళల కోసం పనిచేస్తోందన్నారు. 1974లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థినుల చొరవతో ఆర్భవించిన పీవోడబ్ల్యూ మొదటగా మహిళలపై వేధింపులకు , అసభ్య సాహిత్యానికి , వరకట్న హత్యలకు వ్యతిరేకంగా తన కార్యక్రమాలను ప్రారంభించిందనీ ఆ తర్వాత అధిక ధరలను, అవినీతిని, నిరుద్యోగాన్ని వ్యతిరేకిస్తూ  సాగిన ప్రజా ఉద్యమాల్లో పిఓడబ్ల్యు భాగమై సాగిందన్నారు.  పురుషాధిక్యతకు వ్యతిరేకంగా పోరాడే మహిళా సంఘాల అవసరాన్ని గుర్తించి, పురషాధిక్యతకు కారణమైన వ్యవస్థకు వ్యతిరేకంగా.. కార్మిక, కర్షక సోదర సోదరీమణులతో కలిసి పోరాటాల్లో భాగమైందన్నారు. పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు సవలాపురపు కృష్ణవేణి అధ్యక్షతన జరగనున్న మహాసభలకు ప్రారంభకులుగా పీవోడబ్ల్యూ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు  ఆర్. గంగాభవాని, ప్రధాన వక్తగా పీవోడబ్ల్యూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  యం. లక్ష్మి, వక్తలుగా  రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రమణి, రాష్ట్ర కార్యదర్శి ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ జిల్లా నాయకులు కామ్రేడ్ హేమక్క, కే. జానకమ్మ, పి. సావిత్రమ్మ, పుణ్యవతి, పి. సరస్వతి  జానకమ్మ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*