కుమార్ నాయక్ కు "ఎక్సలెన్స్ జాతీయ అవార్డు 24 "

9/19/2024 10:40:28 PM

- హర్యానా గవర్నర్ చేతులు మీదుగా

సోంపేట- ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 19
    స్వచ్ఛంద సేవా సంస్థలు, కళావేదికలు ,ఉద్యోగ సంఘాలు, సాహితీ సంస్థలు, సినిమా సంఘాలో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ, జిల్లా ,గ్రామీణ  స్థాయిలో 60 సంఘాల్లో  ఉంటూ విశేష సేవలు అందిస్తున్నందుకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఆయన నివాసం హైదరాబాదు లో ఈ అవార్డును కుమార్ నాయక్  అందుకున్నారు. ఒక వ్యక్తి ఇన్ని సంఘాల్లో వివిధ హోదాల్లో ఉంటూ నిత్యము సేవలందిస్తూ ముందుకు సాగడం ప్రశంసనీయం.అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ త్రోఫిక్ సొసైటీ జాతీయ అధ్యక్షులు అద్దంకి రాజా, బి.జె.పి. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రొయ్యూరు శేష సాయి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. జనవరి 2024న రాజమహేంద్రవరంలో జరిగిన అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో సేవలు అందించినందుకు గాను నాగాలాండ్ గవర్నర్ . గణేషన్ చేతుల మీదుగా" ప్రశంసా పత్రం" ఇదివరలో అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ అనిల్ చంద్ర పునేట,ఒరిస్సా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ఘనత డాక్టర్ కుమార్ నాయక్ దక్కింది.

Name*
Email*
Comment*