కవిటిలో "ఇది మన ప్రభుత్వం"

9/19/2024 10:41:55 PM


నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజపురం రాక

ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ,ఎస్పీ

సోంపేట- ఎక్స్ ప్రెస్ న్యూస్ ,సెప్టెంబర్ 19
 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 20న  ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వందరోజుల పూర్తయిన నేపథ్యంలో  " ఇది మన ప్రభుత్వం " పేరిట కవిటి మండలం రాజపురం గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రోజులపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.  కార్యక్రమం నిర్వహణకు ఒక్కరోజే గడువు ఉండడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్రబాబు నాయుడు జిల్లాకు రావడంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి గురువారం ఉదయం ఏడు గంటలకే రాజపురం చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే ఉండి ఏర్పాట్లను స్వయంగా జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షించారు. వింధ్య గిరిలో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్ నుంచి రూట్ మ్యాప్, రాజపురంలో గ్రామసభ నిర్వహించే రచ్చబండ వేదిక ఏర్పాటు, అలాగే తొలుత నలుగురు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో ముచ్చటించే కార్యక్రమానికి  సంబంధించిన ఏర్పాట్లను వారు స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్ తో కలసి స్థానిక యంత్రాంగానికి ఈ సందర్భంగా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, ఆర్డీవో భరత్ నాయక్, ఏఎస్పి శ్రీనివాసరావు డిఎస్పి వివేకానంద, డిఆర్డిఏ పిడి కిరణ్ కుమార్, ఆర్అండ్బి ఎస్ఈ జాన్ సుధాకర్ ,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరాడ చంద్రమోహన్ ,నియోజకవర్గ పరిధిలోని పలువురు టీడీపీ కీలక నేతలు  ఉన్నారు.

Name*
Email*
Comment*