సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు

9/19/2024 11:01:34 PM


- ప్ర‌కాశం జిల్లాలో ఖ‌రారు
- శ్రీకాకుళంలో వ‌ర్షాలు కార‌ణంగానేన‌ట‌

శ్రీకాకుళం, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌; 
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్ర‌వారం త‌ల‌పెట్టిన శ్రీకాకుళం జిల్లా పర్యటన ఆకస్మికంగా రద్దయింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం.. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురం గ్రామంలో పర్యటించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వంద  రోజుల పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో భాగంగా తొలిసభ జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం పర్యటన రద్దయినట్టు సమాచారం.

ప్రకాశం జిల్లా పర్యటన ఖరారు..

శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు కావడంతో ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన ఖరారైంది. ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలంలో  ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Name*
Email*
Comment*