భీమిలి రూరల్ - వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5
భీమునిపట్నం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కె. నగరప్పాలెం రూ.19.20 లక్షలు, కాపులుప్పాడ రూ 19.50 లక్షలు, నిడిగట్టు రూ.19 లక్షల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. జీవీఎంసీ 4వ వార్డు పరిధిలో కె నగరపాలెం, కాపులుప్పాడనిడిగట్టు ప్రాంతాల్లో సిసి రోడ్లు డ్రెయిన్ల నిర్మాణానికి రూ.57 లక్షల 70 వేలు నిధులు జీవీఎంసీ సాధారణ నిధులనుండి మంజూరు చేసామన్నారు. మూగ జీవాలైన పశువులకు వైద్యం అందరిని ద్రాక్షగా ఉందని వైద్యుని అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్థానికులు వినతిపత్రం అందజేశారు.కొంతమంది ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. సోమన్నపాలెంలో యాళ్ల తరబడి నివాస ఏర్పరచుకున్నప్పటికీ పూర్తి హక్కు లేదని ఇప్పటికైనా శాశ్వత హక్కు పత్రాలు ఇప్పించాలని రజకులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కోరారు. ఇప్పటికే విద్యుత్ కలెక్షన్లు ,ఇంటి పన్నులు పొందామని గంటా కు వివరించారు.ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని రజక సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పి ప్రేమ ప్రసన్న వాణి,బీజేపీ ఇంచార్జి రామానాయుడు, ఈఈ విజయదుర్గ, జడ్పీటీసీ గాడు వెంకటప్పడు 4వ వార్డు టీడీపీ అధ్యక్షులు పాసి నర్సింగరావు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు డిఏఎన్ రాజు, తెదేపా సీనియర్ నాయకుడు కింగ్ తదితరులు పాల్గొన్నారు.