హెచ్ ఆర్ ఏ ను చెల్లించాలి

10/5/2024 10:35:32 PM


ఉక్కు నగరం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5:

ఈడి వర్క్స్ వద్ద ఉక్కు కార్మికుల నిరసన
పెంచిన కరెంటు చార్జీలు, నిలిపివేసిన హెచ్.ఆర్.ఏ. చెల్లించాలని కోరుతూ శనివారం ఉక్కు కార్మికులు ఈడి వర్క్స్ వద్ద  పెద్ద ఎత్తున  ఆందోళన చేపట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉక్కు క్వార్టర్స్ లో నివసిస్తున్న కార్మికులకు మేనేజ్మెంట్ ఒక యూనిట్ కరెంటుకి 8 రూపాయల చొప్పున వసూలు చేస్తూ నిర్ణయం తీసుకోండి. అక్టోబర్ నెల పే స్లిప్ లో ఒక్కొక్క కార్మికుడికి వేల రూపాయలు కరెంట్ బిల్లు రూపంలో కోత విధించింది. దేశంలో కరెంట్ బిల్లు స్లాబ్ పద్ధతిలో ధర నిర్ణయిస్తారు. కానీ ఉక్కునగరంలో స్లాబ్ పద్ధతిలో కాకుండా ప్రతి యూనిట్ 8 రూపాయలుగా నిర్ణయించి వసూలు చేస్తున్నారు. 

హెచ్ఆర్ఏ నిలుపుదల....

 బయట నివసించే కార్మికులకు హెచ్ఆర్ఏ నిలుపుదల చేసింది. దీంతో ఒక్కొక్క కార్మికులకు 6000 నుంచి 20000 వరకు హెచ్ఆర్ఏ రూపంలో కార్మికులు నష్టపోతున్నారు. ప్లాంటు ఆర్థిక పరిస్థితుల దృశ్య అనేక ఆర్థిక సౌకర్యాలను మేనేజ్మెంట్ తొలగించింది. ఇప్పుడు అతి ముఖ్యమైన హెచ్ఆర్ఏ ని తొలగించడంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన ఒప్పందం అమలు చేయకుండా... పాత జీతాలతోనే కాలయాపన చేస్తూ.. ఇప్పుడు ఈ వచ్చే దాంట్లో కూడా కరెంట్ బిల్లు రూపంలో, హెచ్ ఆర్ ఏ రూపంలో వేల రూపాయలు కోత కోయడం తో కార్మికులు నిరసనకు దిగారు. మేనేజ్మెంట్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని భవిష్యత్తులో పునరుద్ధరిస్తామని చెబుతున్నారు. కానీ కార్మికులు తక్షణమే ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఉదయం నుంచి రాత్రి వరకు ఈడి వర్క్స్ వద్ద భారీగా చేరి నిరసనకు చేపడుతున్నారు.

Name*
Email*
Comment*