ఎమ్మెల్యేను కలిసిన మెరకముడిదాం మండల జనసేన నాయకులు

10/5/2024 10:43:49 PM

మెరకముడిదాం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5 :
చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావును మెరకముడిదాం జనసేన పార్టీ నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షురాలు రౌతు కృష్ణవేణి మాట్లాడుతూ.. చీపురుపల్లి ఆర్ ఈ సి యస్ లో ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ ధ్రువపత్రాలతో సుమారు 22 మంది ఉద్యోగాలు పొందారని సమగ్ర దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Name*
Email*
Comment*