ఇచ్ఛాపురం - వైజాగ్ ఎక్స్ ప్రెస్ - అక్టోబర్ 5
దసరా శరన్నవరాత్రుల పురస్కరించుకొని గ్రామదేవత శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో నేడు ( ఆదివారం) సాయంత్రం సంగీత కచేరి నిర్వహించబడుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు అంతర్జాతీయ కళాకారులు (గాత్రం ) విద్వాన్ శ్రీ పట్టాభిరామ పండిత్ ఆల్ ఇండియా రేడియో, టీవీ కళాకారులు మావుడూరు సత్యనారాయణ, ( వయాలిన్) బంకుపల్లి దుర్గా శ్రీనివాస్ , (మొర్సింగ్ ) ప్రముఖ కళాకారులు వినోద్ కుమార్ (ఘటం ), సిహెచ్ చాణిక్య (కంజీర), ఇ. లక్ష్మణమూర్తి (కంజీరా ) కళాకారులచే సంగీత గాత్రకచేరి నిర్వహించబడుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.