ఎకువూరులో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

10/5/2024 10:48:32 PM


 మహాచండీ హోమంలో శివాజీ ,అశోక్ దంపతులు

సోంపేట - వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5

   దుర్గా పూజలు పురస్కరించుకుని ఈనెల మూడో తేదీన నుంచి పురాణ ప్రసిద్ధిగాంచిన ఎకువూరు శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో వివిధ రకాల పూజలుతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శనివారం భారీ ఎత్తున నిర్వహించిన శ్రీ మహా చండీయాగంలో మాజీ మంత్రి గౌతు శివాజీ ,ఇఛ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ దంపతులు  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవాని భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రతినిధి ప్రముఖ వ్యాపారవేత్త గొట్టిపాటి కృష్ణం నాయుడు ,టిడిపి రాష్ట్ర కార్యదర్శి సూరాడ ,చంద్ర మోహన్ , మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, బడే సూర్యనారాయణ,  బడె తమ్మయ్య ,మాగుపల్లి పాపారావు ,స్థానిక సర్పంచ్ మాధవరావు, లుతోపాటు ఉప్పలాం పంచాయతీ పరిధిలోని వందలాదిమంది భవాని భక్తులు, దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బడే ఈశ్వరరావు దేవకి దంపతులు  ప్రత్యేక పూజలో పాల్గొన్న ఈ మహా చండీయాగంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు తరలివచ్చారు. పలాసకు చెందిన డాక్టర్ ధర్మపురం సుబ్రహ్మణ్యం కాశ్యప (నాని వేద పండితులు) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆద్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

Name*
Email*
Comment*