ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్ కృషితో సాకారం కానున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్.
రణస్థలం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5
ఎచ్చెర్ల నియోజకవర్గం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డిగ్రీ కళాశాల అంశం నేడు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిగ్రీ కాలేజ్ ప్రారంభించడానికి ఫీజుబిలిటీ సర్వే రిపోర్ట్ పంపించవలసిందిగా శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సురేఖ ఆదేశించడంతో ఈరోజు ఆమె ఎచ్చెర్ల శాసనసభ్యులు ఈశ్వరరావు కలిసి కొండములగాం జూనియర్ కాలేజ్ ను పరిశీలించడం జరిగింది. రణస్థలం మండల తహసిల్దార్ మరియు మండల సర్వేయర్ ఫీజిబిలిటీ సర్వే నిర్వహించారు.
ఈ విషయమై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు సహకారం అందించిన నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు త్వరలోనే కొత్త విద్యా సంవత్సరంలో క్లాసులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలియజేశారు. డిగ్రీ కాలేజ్ ప్రారంభించడానికి ముందడుగు పడేందుకు కృషి చేసిన ఎన్ఈఆర్ కు ఈ సందర్భంగా మండల నాయకులు లంక శ్యామల రావు పిన్నింటి బానోజీ నాయుడు దన్నాన సత్తిబాబు దన్నాన స్వామి నాయుడు , కాయత రమణ తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు.