ముంచంగిపుట్టు- వైజాగ్ ఎక్స్ ప్రెస్: అక్టోబర్ 05
ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం( ఐద్వ ) ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో గల తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళ సంఘం అధ్యక్షులు ఎస్ ఈశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ విధానాన్ని రద్దు చేయాలని మండల తహశీల్దార్ కు వినతిపత్రం అందించమన్నారు. గత ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వం ఆధీనంలోనే నడిపించేదని పేర్కొన్నారు.
మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని, ప్రైవేట్ అప్పగించే విధానాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆమె అన్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్ల గ్రామాల్లో అధికంగా బెల్టు షాపులు పెరుగుతాయని ఆమె తెలియజేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు పెరగడం వల్ల యువత మత్తు పదార్థాలకు బానిసై చెడిపోయి ప్రమాదం ఉంటుందన్నారు.
కుటుంబంలో కల్లోహాలు గొడవలు మరింత పెరిగే అవకాశం ఉందని స్త్రీ జాతికే రక్షణ లేకుండా పోతుందని ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంజిత, దేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.