ముంచంగిపుట్టు - వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5
నూతన మండల అభివృద్ధి అధికారి గా శ్రీ సాయి హర్ష శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీవో అధికారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని 23 పంచాయతీ అభివృద్ధికి తన వంతు సాయసక్తుల కృషి చేస్తానని ఆయన అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నుండి బదిలీపై అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం ఎంపీడీవో గా వచ్చానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి కార్య లయ సిబ్బంది పాల్గొన్నారు.