ఘనంగా మనం సేవా సొసైటీ ద్వితీయ వార్షికోత్సవం

10/5/2024 11:03:37 PM

 

చింతపల్లి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 05: 

అతి పిన్న వయసులోనే సమాజం పట్ల బాధ్యతతో మనం సేవా సొసైటీని స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువకులకు మండలంలోని ప్రముఖులు ఘనంగా సత్కరించారు. శనివారం నాడు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో మనం సేవా సొసైటీ వ్యవస్థాపకులు పెదిరెడ్ల గౌతం నరేంద్ర మహర్షి సొసైటీ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ దురియా పుష్పలత, జడ్పిటిసి పోతురాజు బాలయ్య, చింతపల్లి ఎస్ఐ అరుణ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం సేవా సొసైటీ సేవలను కొనియాడారు. అతి తక్కువ కాలంలో మనం సేవా సొసైటీని స్థాపించి మండలంలోని పలు ప్రాంతాలలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సొసైటీ వ్యవస్థాపకులు పెదిరెడ్ల గౌతమ్ నరేంద్ర మహర్షిను అభినందించారు. చిన్నతనం నుంచే సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ సామాజిక సేవే లక్ష్యంగా అనేకమంది నిరుపేదలకు వివిధ రూపాలలో తమ వంతు సహాయం అందించడం హర్షించదగ్గ విషయం అన్నారు. యువత విద్యతో పాటు సమాజ సేవలో భాగస్వాములై ప్రజలకు సేవ చేయడం ఎంతో శుభపరిణామమన్నారు. నేటి యువతకు మనం సేవా సొసైటీ చేస్తున్న సేవలు ఆదర్శనీయమన్నారు. యువతి యువకులు సభ్య సమాజంలో తమ తల్లిదండ్రులు గర్వించే విధంగా మెలగాలని, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కానీ కొంతమంది యువత చెడు వ్యసనాలకు బానిసై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. నేటి సమాజంలో ఇతరులకు సేవ చేసే గుణం కొంతమందికే ఉంటుందని అందులో మొదటి వరుసలో నిలిచేది మనం సేవా సొసైటీ వ్యవస్థాపకులు గౌతమ్ నరేంద్ర మహర్షి, సొసైటీ సభ్యులేనని కొనియాడారు. ఒక్కరితో ప్రారంభమైన మనం సేవా సొసైటీ నేడు దేశవ్యాప్తంగానే కాక ఇతర దేశాలలోనే సభ్యులుగా పలువురు చేరడం హర్షించదగ్గ విషయం అన్నారు. రాబోయే రోజులలో సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి, మరెంతోమందికి సహాయపడాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అనంతరం సొసైటీ వ్యవస్థాపకులు గౌతమ్ నరేంద్ర మహర్షికి కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంకిపాటి వీరన్న పడాల్ (బాబులు), చేయూత వారియర్స్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దూనబోయిన రమణ, వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు, జోగేశ్వరరావు, బేతాళుడు, పంచాయతీ కార్యదర్శి కె శ్రీనివాస్, ఉపాధ్యాయుడు కే పోతురాజు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*