ముంచంగిపుట్టు - వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5
నిరుపేద కుటుంబ ముసలివ్వ బురిడీ ముంగిలి మృతదేహాన్ని శనివారం వైసీపీ నేత వి. సాధురం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలో గల లక్ష్మీపురం పంచాయతీ మెట్టగూడ గ్రామ స్థిర నివాసులు బురిడీ మొoగిలి ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తుది శ్వాస విడిచి స్వర్గస్తులయ్యారని ఆయన తెలిపారు. విషయం తెలుసుకొని మెట్టగూడ గ్రామంలో వైసీపీ నేత సాధురం చేరుకొని మృతదేహాన్ని నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి భరోసానిస్తూ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. స్వయంగా ఆయన పాడే మోసి కడవరకు సాగనంపి దానసంస్కారాలు దగ్గరుండి నిర్వహించమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.