- శనివారం నుంచే అకౌంట్లలో జమ
- అర్హులైన ప్రతి రైతుకూ రూ.2 వేలు
ఢిల్లీ, వైజాగ్ ఎక్స్‌ప్రెస్;
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.6000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే ఈ సాయాన్ని మూడు విడతలలో అందిస్తున్న విషయం విదితమే. ఈక్రమంలోనే రైతులకు మొదటి విడత సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మొదటి విడత సాయంలో భాగంగా రూ. 2000 సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద శనివారం రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేయనుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ కానున్నాయి. అదేవిధంగా నమో షెట్కారీ మహా సన్మాన్ నిధి యోజన కింద మహారాష్ట్ర రైతులకు అదనంగా మరో రూ.2 వేలు వారి ఖాతాల్లో అధికారులు జమ కానున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇది 18వ విడత కావడంతో రైతల ఖాతాల్లోకి జమ చేసే డబ్బు రూ.3.45 లక్షల కోట్లు దాటనుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 11 కోట్ల మందికిపైగా అన్నదాతలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు. ప్రధాని మోదీ రెండోసారి ఎన్నికకు ముందు రైతులకు సాయం అందించే క్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా రెండు ఎకరాలకు పైగా ఉన్న రైతులను పథకానికి అర్హులుగా గుర్తించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ఆదర్శంగా తీసుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పలు పథకాల పేరుతో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రకటించిన ఇస్తోన్న దగ్గరి నుంచి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య క్రమేపి పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద డబ్బులు జమ అయ్యాయా లేదా చూసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in/లోకి వెళ్లాలి. అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ పేజీలోకి వెళ్లి.. బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేసి లబ్ధిదారుడి ఆధార్ లేదా అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. లబ్ధిదారుడి రాష్ట్రం, జిల్లా, గ్రామం ఎంటర్ చేయడం ద్వారా జాబితాలో పేరు ఉందో లేదో తెలిసుకునే అవకాశాన్ని కల్పించారు.