ఆర్డీఓలు బాధ్యతల స్వీకరణ

10/5/2024 11:22:02 PM


శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5;
శ్రీకాకుళం, టెక్కలి ఆర్డివోలుగా నియమితులైన కే సాయి ప్రత్యూష, ఎం కృష్ణమూర్తిలు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు మునుపు వారిరువురు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చాలను అందజేశారు. 2023 గ్రూప్-1 బ్యాచ్ కు చెందిన ఈ ఇద్దరు అధికారులు ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని తొలిసారి ఆర్డీవోలు నియమితులయ్యారు. టెక్కలి ఆర్డిఓ కృష్ణమూర్తి ఎంటెక్ పట్టభద్రులు. ఆయన గతంలో పోలీసు శాఖలో ఎస్సైగా పదేళ్లపాటు పనిచేశారు. శ్రీకాకుళం ఆర్డీవో ప్రత్యూష ఢిల్లీ యూనివర్సిటీలో బిఏ (హానర్స్) చదివారు. చిత్తూరు జిల్లాలో పంచాయతీ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం గ్రూప్-1 లో ఆర్డీవో కేడర్లో ఎంపికై శిక్షణ పొందారు. వీరిని జిల్లా కలెక్టర్ అభినందిస్తూ, వారి రెవెన్యూ డివిజనల్ పరిధిలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని, ప్రజలకు రెవిన్యూ సేవలను విస్తృతం చేయాలని ఆదేశించారు.

Name*
Email*
Comment*