.వేదమంత్రాలతో పులకించిన సింహగిరి భక్తజనం
సింహాచలం, ఎక్స్ ప్రెస్ న్యూస్;
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మేరక స్వామివారి స్వాతి హోమమునకు ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 49 జంటలు పాల్గొని స్వామి ని దర్శించుకున్నారు. ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజు స్వామి,మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్ ను వేద మంత్రాలతో మృధు మధుర మంగళ వాయిద్యాలు నడుమ శాస్త్రోక్తముగా పూజాది కార్యక్రమాలు అధిక సంఖ్యలో భక్తులు పూర్ణహుతి లో పాల్గొన్నారు భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం, సదుపాయం కల్పించారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా సింహాద్రినాధుడు ను దర్శించుకుని సేవించుకున్నారు. ఆలయ ఈవో వి. త్రినాథరావు స్వాతి హోమంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ స్వామివారి స్వాతి హోమం ఎంతో ప్రతిష్టాత్మకంగా కనులు విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు .