గుత్తేదారులు జీవీఎంసీ పనుల్లో నాణ్యతను పాటించాలి

10/5/2024 11:28:49 PM


- జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్

విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,అక్టోబర్ 05 :  
నగరంలో జీవీఎంసీ కి సంబంధించి జీవీఎంసీ గుత్తేదారులు చేపట్టిన అభివృద్ధి పనులలో నాణ్యతను తప్పకుండా పాటించి సకాలంలో పూర్తి చేయాలని  జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన  జీవిఎంసి సమావేశం మందిరంలో ఇంజనీరింగ్ అధికారులు గుత్తేదారులతో కలసి శనివారం సమీక్షను నిర్వహించారు.
ఈ సమీక్షలో కమిషనర్  ముందుగా గుత్తేదారులు  వివరించిన ధరావత్తు సొమ్ము చెల్లింపులు, పూర్తయిన పనులకు బిల్లులు చెల్లింపులు, ఇసుక కొనుగోలు చేయుటలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సి ఎఫ్ ఎం ఎస్ ద్వారా పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపులు, స్పెషల్ డెవలప్మెంట్  ఫండ్ గ్రాంట్ పనులు,  పెండింగ్ లో ఉన్న ఏ ఎస్ డి ,ఎఫ్ ఎస్ డి,  చెల్లింపులు తదితర సమస్యలపై సానుకూలంగా స్పందించారు. జీవీఎంసీ ఆర్థిక నిధుల స్థితికి అనుగుణంగా ప్రతి ఒక్క గుత్తేదారునకు  చెల్లించవలసిన బిల్లులకు ప్రాధాన్యతనిస్తూ ప్రయారిటీ బేస్ లో తప్పకుండా బిల్లును చెల్లించడం జరుపుతామన్నారు. ఈ ఎండి ,ఏ ఎస్ డి, ఎఫ్ ఎస్ డి తదితర బిల్లులను కూడా పరిగణలోనికి తీసుకొని చెల్లింపులకు సంబంధించిన చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ ఆదేశించారు. విశాఖ నగర పరిధిలో ప్రజల సౌకర్యార్థమై నగర అభివృద్ధి దిశగా  పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుచున్నవని, ఆయా పనులను చేపట్టిన సంబంధిత గుత్తే దారులు పనుల నాణ్యతలో ఎక్కడ రాజీ లేకుండా , ఆలస్యం కాకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు సూచనలను పరిగణలోనికి తీసుకొని చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా చేపట్టిన పనుల్లో నాణ్యతా లోపం ఉండకూడదని గుత్తే దారులకు కమిషనర్ సూచించారు. కాంట్రాక్ట్ పనులను చేపట్టి మధ్యలోనే విడిచిపెట్టడం, ఆలస్యం చేయటం, వాటిలో నాణ్యత లోపం కనిపించినట్లయితే జీవీఎంసీ తప్పకుండా ఆయా గుత్తేదారులపై అవసరమగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ గుత్తేదారులకు వివరించారు. ఇంజనీరింగ్ అధికారులు కూడా గుత్తేదారులు చేపట్టిన కాంట్రాక్టు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యతను మెరుగు పరుస్తూ సకాలంలో సంబంధిత గుత్తేదారులు పనులను పూర్తిచేసేలా  చర్యలు చేపట్టి సంబంధిత కాంట్రాక్ట్ బిల్లులను వెంటనే సంబంధిత విభాగాలకు నివేదించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్ ఎస్ వర్మ ,ఎగ్జామినేర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి ,ఫైనాన్స్ అడ్వైజర్ మల్లికాంబ ,ప్రధాన ఇంజనీర్ శివప్రసాద్ రాజు, పలువురు పర్యవేక్షక ఇంజనీర్లు, కార్యనిర్వాక ఇంజనీర్లు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయక ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు

Name*
Email*
Comment*