విశాఖపట్టణం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,అక్టోబర్ 5;
విశాఖపట్టణం ఆర్డీవోగా పి. శ్రీలేఖ శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ను తన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఈమె జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి జిల్లాకు వచ్చారు. ఆర్డీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.