*రూ.57 లక్షల రోడ్లు, డ్రెయిన్లకు శంకుస్థాపన చేసిన గంటా
భీమిలి, వైజాగ్ ఎక్స్ ప్రెస్,అక్టోబర్ 5:
జీవీఎంసీ భీమిలి జోన్ లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం శంకుస్థాపన చేశారు. నగరంపాలెంలో రూ.19.5 లక్షలు, కాపులుప్పాడలో రూ.19 లక్షలు, నిడిగట్టులో రూ.19 లక్షలతో వీటి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్తుందన్నారు. విశాఖను దేశంలోనే టాప్ 5 నగరాల సరసన చేర్చాలని ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పి.ప్రేమ ప్రసన్నవాణి, బీజేపీ భీమిలి ఇంచార్జీ రామానాయుడు, టిడిపి నాయకులు గాడు వెంకటప్పడు, డి.ఎ.ఎన్.రాజు, గంటా నూకరాజు, వై.అనీల్ ప్రసాద్, పాసి నరసింగరావు, గరికిన ఎల్లాజీ, ఉప్పాడ రాము సీరపు రమణ, తదితరులు పాల్గొన్నారు.