సిపిఐ ఎంఎల్ (మావోయిస్టు) పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్?

10/5/2024 11:36:16 PM


. మిలటరీ వ్యూహ కర్త 
. బిటెక్ పూర్తి చేసి విప్లవ బాటలోకి 
. శ్రీకాకుళం జిల్లావాసి 
. కుటుంబ సభ్యుల్లో విషాదం 

 శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్;
సిపిఐ ఎంఎల్ (మావోయిస్టు) పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న నిన్న చత్తీస్ ఘడ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో మరణించినట్టు మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. ఇదే నిజమైతే, అతని గురించి కొన్ని వివరాలు..
 కేశవరావు జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాలి మండలంలోని జియ్యన్నపేట గ్రామం . వరంగల్ లో బీటెక్ చదువుకున్న రోజుల్లోనే ఆర్ ఎస్ యు లో చేరి, ఎంటెక్ కూడా చదువుకొని అనంతరం పీపుల్స్ వార్ లో చేరారు. బీటెక్ పూర్తయిన తర్వాత, 1980లో ఒకసారి అరెస్టు అయ్యారు. 1984లో ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విద్యార్థిగా ఉండగానే ఓసారి తన స్వగ్రామం వచ్చి, తనకు రావలసిన వాటా గా ఆస్తి ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగారు. తండ్రి వాసుదేవరావు టీచర్. అన్నదమ్ముల చదువులకే ఆస్తి సరిపోయిందని ఆయన చెప్పిన తరువాత, ఇల్లు విడిచి వెళ్లిపోయారు. స్వగ్రామం రావడం అదే చివరిసారి. సోదరుడు ఢిల్లీశ్వరరావు వివిధ పోర్టుల్లో ఉన్నతాధికారిగా పని చేశారు. ఆయనకు ముగ్గురు అక్క చెల్లెలు కూడా ఉన్నారు. 
మిలటరీ వ్యూహం లో దిట్ట 

  గెరిల్లా, మిలటరీ, సాంకేతిక వ్యూహాలు, నైపుణ్యాలలో దిట్టగా పేరుపొందిన కేశవరావు అంచలంచలుగా పార్టీలో ఎదిగారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలోని అడుగుపెట్టిన తొలి కమాండర్ అతడే. ఎల్ టి టి ఈ మాజీ యోధుల శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన మావోయిస్టు ప్రముఖుల్లో ఆయన ఒకరు. అనేక కీలకమైన ఆపరేషన్ల వెనుక అతని వ్యూహం, పాత్ర ఉందని వివిధ రాష్ట్రాల పోలీసు ఉన్నత అధికారుల అనుమానం. పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు. 2018లో కేంద్ర ప్రధాన కార్యదర్శి పదవికి అనారోగ్య కారణాలతో ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత, కేశవరావు ఎన్నికైనట్టు సమాచారం. ఆయన తలపై వివిధ ప్రభుత్వాలు ప్రకటించిన రివార్డు మొత్తం కోటి రూపాయలని తెలుస్తుంది.

Name*
Email*
Comment*