బైక్ అదుపు తప్పి ఏ.ఆర్. కానిస్టేబుల్ మృతి

10/17/2024 10:15:44 PM

కురుపాం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
కురుపాం నియోజకవర్గంలోని జరడ- నీలకంఠాపురం ఘాట్ రోడ్ లో బైక్ అదుపు తప్పి పడిపోయిన ఘటనలో ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్లో ఏ . ఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కె. బుల్లి బాబు మృతి చెందాడు. ఆయన హిర మండలం నుండి ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది .ఎప్పుడూ అందరితో సరదాగా ఉండే బుల్లి బాబు మరణ వార్త వినగానే తోటి పోలీస్ సిబ్బంది తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

Name*
Email*
Comment*