గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ

10/18/2024 12:27:01 AM

గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17: 
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో 16-10-2024 నుండి31-10-2024 వరకు అన్ని గ్రామాలలోని గొర్రెలు, మేకలకు ఉచితముగా నట్టల నివారణ మందులు పంపిణీ చేయబడునని గొలుగొండ ఏరియా పశు వైద్య శాల సహాయ సంచాలకులు .  రాంబాబు తెలియజేశారు. నట్టల నివారణ ద్వారా జీవాలలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి పిల్లలలో మరణాల రేటు తగ్గుతుందని, శరీర బరువు పెరుగుదల రేటు కూడా వృద్ది చెందుతుందని కావున గొర్రెల పెంపకందారులందరూ మీ గ్రామ రైతు సేవా కేంద్రం లోని పశు సంవర్ధక సహాయకులను గాని పశు వైద్య శాల ను గాని సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు . ఈ సందర్బంగా గొలుగొండ మండలంలో కోమిరా గ్రామంలో ఈ నట్టల నివారణ మందు పంపిణి ని జిల్లా డిప్యూటీ డైరెక్టర్. చందక నరసింహులు. ప్రత్యేకంగా వచ్చి పర్యవేక్షించారు . ఈ కార్యక్రంలో గొలుగొండ పశువైద్యాధికారి డాక్టర్ రమేష్, కృష్ణా దేవి  పేట పశువైద్యాధికారి డాక్టర్ శిరీష, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కర్రి నాయుడు, పశు సంవర్ధక అసిస్టెంట్ అనూష గొర్రెల పెంపకం దారులు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*