ఈ నెల 20న వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు అభ్యర్థుల ఎంపిక

10/18/2024 12:40:30 AM

 నర్సీపట్నం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
ఉమ్మడి విశాఖ జిల్లా బాల బాలికల వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ పోటీల సెలెక్షన్లు ఈనెల 20వ తేదీ ఆదివారం నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారని చెట్టుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జి.దేవి గురువారం తెలిపారు. ఈపోటీల్లో  గెలుపొందిన విజేతలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన సొంత నిధులతో గోల్డ్ మెడల్స్  స్పాన్సర్ చేస్తున్నారని ఈమేరకు విజేతలకు ఇవ్వనున్న బంగారు పతకాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్యాంప్ కార్యాలయంలో తమకు అందజేశారని తెలిపారు ఈగోల్డ్ మెడల్స్‌ను నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆర్. శ్రీనివాస్ నాయుడుకు అందజేశామన్నారు. బాల బాలికలకు వెయిట్ లిఫ్టింగ్ అండర్ 17 కేటగిరీలలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలు తెనాలిలో జరగనున్న స్టేట్ వెయిట్ లిఫ్టింగ్  పోటీలలో పాల్గొనే అవకాశం కలుగుతుందని  వ్యాయామ ఉపాధ్యాయురాలు జి. దేవి తెలిపారు.

Name*
Email*
Comment*