నర్సీపట్నం డిగ్రీ కళాశాల పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు కల్పించాలి

10/18/2024 12:42:41 AM

స్పీకర్ అయ్యన్నకు ఎస్.ఎఫ్.ఐ సభ్యులు విజ్ఞప్తి:

నర్సీపట్నం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17: 
నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాలలో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ను ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు గురువారం స్పీకర్ అయ్యన్నను కలిసి వినతి పత్రం అందజేశారు. నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు ఇవ్వడం లేదని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు మెరిట్ లేని విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ఇవ్వడం లేదని అయితే ప్రైవేట్ కళాశాలల్లో మెరిట్ లేకున్నా అడ్మిషన్లు ఇస్తున్నారని వివరించారు. ఈ అంశంపై తక్షణమే స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆంధ్ర యూనివర్సిటీ  వైస్ ఛాన్సలర్ కి ఫోన్ చేసి పీజీ సీట్లు భర్తీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో ఎటువంటి అర్హత లేకుండా అడ్మిషన్లు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ కళాశాలల్లో పీజీ సీట్లు భర్తీ చేయకపోవడంవల్ల పేద విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు.  పీజీ కోర్సుల సీట్లు ఖాళీగా ఉంచితే  ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తూ ఈ సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయడం వలన విద్యార్థులకు మేలు జరుగుతుందని స్పీకర్ అభిప్రాయపడ్డారు. పీజీ సీట్ల భర్తీ విషయంలో ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంపై విద్యార్థులకు న్యాయం జరిగేలా విద్యాశాఖ మంత్రితో మాట్లాడుతానని స్పీకర్ అయ్యన్న హామీ ఇచ్చారు విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి ఉత్తమ ఫలితాలు సాధించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.

Name*
Email*
Comment*