నాయకులు దుర్వినియోగం చేస్తున్న పల్లె పండుగ నిధులు!

10/18/2024 12:49:22 AM

అంబాజీపేట, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబరు 17:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ  జిల్లాలోని అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె పండుగ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. గ్రామంలో పలు వార్డుల్లో వీధి రోడ్లు పూర్తిగా పాడైపోయి అధ్వానంగా ఉన్నా వీధి రోడ్లకి,  నిధులు  వినియోగించకుండా అధికార పార్టీ నాయకులు పలుకుబడితో రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూ  గ్రామ  ప్రజల అదరికీ ఉపయోగపడవలసిన   పంచాయతీ నిధులను సొంత ప్రయోజనాలకే వాడుకుంటున్నారు అని, ఆ క్రమంలోనే ఇసుకపూడి గ్రామ చెరువు వద్ద బంగారమ్మ తల్లి గుడి సమీపంలో కేవలం రెండు గృహాలు పేరుతో  ప్రస్తుతానికి మరమ్మత్తులు కూడా అవసరం లేని రహదారి ఎంపిక చేయించి 3.0 లక్షల నిధులతో సి.సి రోడ్డు నిర్మించుకోబోతున్నాడని, అవే నిధులతో అదే గ్రామంలో అసంపూర్తిగా మిగిలిన దళిత వీధిల్లో అద్వానంగా ఉన్న  రహదారులకు ప్రాముఖ్యత ఇచ్చి ప్రజలకు ఉపయోగపడేలా రోడ్లు నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందని, పలువురు గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు చర్చించుకుంటున్నారు.

Name*
Email*
Comment*