అగనంపూడి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
జీవీఎంసీ 79 వ వార్డు అగనంపూడి సత్రం సెంటర్ జాతీయ రహదారి ప్రక్కన గల మహాత్మా గాంధీ స్వచ్ఛంద చిత్తా రామారావు సేవా సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక టిడిపి సీనియర్ నాయకులు కరణం సత్యారావు ముఖ్య అతిథిగా పాల్గొన్ని వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి పరమ పవిత్రమైన రామాయణాన్ని వరంగా ఇచ్చిన ఆది కవి వాల్మికి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జగన్నాథ్ స్వామి ఆలయ ట్రస్టు చైర్మన్ కరణం పైడిరాజు, స్థానిక నాయకులు రమణ బాబు, సింహాచలం, బుజ్జి, రుద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.