ఎన్ఏడి- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
జీవీఎంసీ పశ్చిమ నియోజకవర్గం 57 వ వార్డు శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవ శుభ సందర్భంగా సాకేతపురం గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం అమ్మవారి సారీ ఊరేగింపు గ్రామంలో మహిళలందరూ కలిసి సారి ఊరేగింపు అంగరంగ వైభవంగా మహిళలు పలు గ్రామాలలో దేవాలయాల సందర్శించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు చివరిగా భక్తులందరూ కలిసికట్టుగా సాకేతపురం గ్రామ విలవేల్పు అయినా శ్రీ దుర్గా దేవి అమ్మవారి ఆలయంలో సారే సమర్పించడం జరిగింది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారి కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు కామాకుల చందర్రావు, రాము, చిరంజీవి, లోకేష్ ,సూర్యా నారాయణ , మున్న, సంతోష్, మూర్తి, అదేవిధంగా గ్రామంలో అధిక సంఖ్యలో మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.