ఆనందపురం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల వేములవలస గ్రామపంచాయతీలో అంగరంగ వైభవంగా దుర్గాదేవి నిమగ్న కార్యక్రమం ఆనందపురం మండలం ఇంద్రానగర్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో దుర్గ నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం దుర్గాదేవి అంగరంగ వైభవంగా నిమ్మిగ్న కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భారీ బాణాసంచ, సంస్కృతి కార్యక్రమాలు, కోలాటం, తప్పుడు గుళ్ళు మధ్య దుర్గాదేవిని నిమగ్న కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా బుధవారం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పాడ శివశంకర్, మధు, సీతారాం, చిన్న, రాజు, బి సాధురావు , శివకృష్ణ,శంకర్ అయ్యప్ప, కోటి, జీవన్, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.