భద్రత చర్యలు చేపట్టాలి

10/18/2024 1:02:18 AM


ఉక్కు నగరం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17 :

 ఐఎన్టీయుసి కార్యవర్గం ఉక్కు భద్రత విభాగం హెచ్ ఓ డి ఎం.ఎస్.ఎన్. రాజు ని కలిసి బాల చెరువు గేట్ లో డ్యూటీ కి వచ్చే ఉక్కు కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు అని తెలియచేస్తూ, B.C గేట్ రోడ్డు లో ఇరువైపులా తుప్పలు ఎక్కువగా పెరిగిపోయి రోడ్డు మీదకు వచ్చేస్తున్నాయిని, రోడ్డు పై గుంతలు మరియు స్ట్రీట్ లైట్స్ రాత్రి సమయం లో వెలగక ఈ మధ్య కాలంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అని తెలియచేశారు. పశువుల సంచారం అధికంగా ఉండటం వల్ల చీకట్లో కార్మికులు ప్రమాదాలకు గురి అవుతున్నారని తక్షణమే భద్రత విభాగం అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంటక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కారు రమణ, ఎస్ ఏ. నాయుడు, ప్రభాకర్ రెడ్డి, మింది దేముడు, దుండి మోహన్, రమేష్ తదతరులు పాల్గోన్నారు.

Name*
Email*
Comment*