ఎన్ఏడి- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
జీవీఎంసీ పశ్చిమ నియోజకవర్గం ఐ టీ ఐ జంక్షన్ లో పీఎం విశ్వకర్మపథకం ద్వారా అర్హులైన వారు కి అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జోన్ 5, జోన్ 8 పరిధికి సంబందించి అక్కడకు విచ్చేసిన స్థానిక ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో విశాఖ పార్లమెంట్ ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిధి గా విచ్చేయడం జరిగింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి వారికీ ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా విశ్వకర్మ కిట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జోనల్ కమీషనర్ రాము , శరగడం రాజశేఖర్, గల్లా చిన్న 57 వ వార్డు అధ్యక్షులు పెంటకోట అజయ్ బాబు, 52 వార్డు టీడీపీ నాయకులు వై .తిరుమల రావు( వై టి ఆర్),54 వార్డు అధ్యక్షులు కార్తీక్ కుట్టా, బీజేపీ నాయకులు కిల్లి శ్రీరామ్మూర్తి, పిల్లి దుర్గారావు, రాపేటి నారాయణరావు, ఏపిడి చిరంజీవి విశ్వ కర్మ పధకం నిర్వాహకులు అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గున్నారు.