ఇచ్ఛాపురం - వైజాగ్ ఎక్స్ ప్రెస్ - అక్టోబర్ 17
ఇచ్చాపురం మండలంలోని పలు పంచాయతీలలో రూ.1.23 కోట్లతో సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి కూటమి నాయకుల శంకుస్థాపన చేశారు. గురువారం తెలుకుంచిలో రూ. 36 లక్షలతో, మశాఖపురంలో రూ. 37 లక్షలతో, బిర్లంగిలో రూ. 50 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు, మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు తెలుకుంచిలో నిర్వహించన గ్రామ సభలో మాట్లాడుతూ గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి ఏడాదిలో కనీసం 100రోజులు ఉపాధి కల్పించి మెరుగైన జీవనోపాధి కల్పన చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో దక్కత శ్రీను, డి కామేష్, ఎస్. సహాదేవ్ రెడ్డి, ఎం. సీతమ్మ, ఆశి మాధవ్ రెడ్డి, మెరుగు సూర్యనారాయణ, డి రామారావు, పద్మనాభం, పి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో రామారావు తదితరులు పాల్గొన్నారు.