సోంపేట- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
సోంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాల్మీకి మహర్షి జయంతిని ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మోహన్ రావు మాట్లాడుతూ మనిషి ఎలా బ్రతకాలో అన్నది వాల్మీకి మహర్షి తాను రాసిన రామాయణంలో ప్రజలకు వివరించారని అన్నారు. అటువంటి మహర్షులను స్మరించుకోవడం అందరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏజీఎంసి రజిని కుమారి ఎన్ ఎస్ ఎస్ పి ఓ లు రామినాయుడు, ఎం ప్రసాద్ ,యుగంధర్, ప్రవీణ్, కల్పన, నారాయణ, విశ్వేశ్వరరావు, సంధ్యారాణి, శ్రవణ్ ,రవి దుర్గాప్రసాద్ ,దుర్యోధన, లతోపాటు వాలంటీర్లు పాల్గొన్నారు.