ఇచ్ఛాపురం - వైజాగ్ ఎక్స్ ప్రెస్ - అక్టోబర్ 17
ఇచ్చాపురం పట్టణ పరిధి ఫకీర్ పేట వాసంతి నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన సిటీ స్కాన్ మిషన్ ను ఎమ్మెల్యే బెందాళం అశోక్, ఎమ్మెల్సీ నర్తు రామారావు గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ రోగులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలకు అందుబాటులో ఇలాంటి సదుపాయాలు కల్పించడం శుభ పరిణామమని అన్నారు. అవకాశం ఉన్నంత వరకు రోగులకు తక్కువ ధరలకే స్కానింగ్ సదుపాయాలు కల్పించాలని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సాలువ లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసంతి నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకులు డాక్టర్ దక్కత త్రినాధ్ రెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ మోహన్ రౌలో, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ దక్కత రాజ్ కుమార్, డాక్టర్ ఏవి రామకృష్ణ, డాక్టర్ గోవింద్ రెడ్డి, మాజీ సీడ్ఆఫ్ చైర్మన్ శ్యాం ప్రసాద్ రెడ్డి, కూటమి నాయకులు, వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు.