పేదరికంలో పుట్టి ఉపాధ్యాయునిగా ఎదిగిన యుగంధర్

10/18/2024 1:10:11 AM

తెలంగాణా డిఎస్సీ లో ప్రతిభ

సోంపేట- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17: 
 సోంపేట మండలం ఎకువూరు మత్స్యకార గ్రామానికి చెందిన వాసుపల్లి యుగంధర్అనే మత్స్యకార యువకుడు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ లో రాష్ట్ర స్థాయిలో 48 ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరిచాడు . 76 మార్కులు పొంది మిర్యాలగూడ మండలం  పాఠశాలలో  జాయిన్ అయినట్లు గ్రామస్తులు తెలిపారు. తండ్రి వేటకి వెళ్లి తెచ్చిన చేపలను తల్లి, భూలక్ష్మి  ఊరూరా తిరిగి అమ్ముతూ కొడుకును ప్రయోజకడుగా తీర్చి దిద్దింది.1 నుండి 5వరకు ఎకువూరు ఎలిమెంటరీ ,6 నుండి 10 వరకు నడుమూరు హైస్కూల్ హరిపురంలో ఇంటర్ పూర్తి చేసి ,శ్రీకాకుళం గురజాడ లో డైట్ పూర్తి చేసినట్లు యుగంధర్ మిత్రులు చెప్పారు.  గ్రామానికి చెందిన మిత్రులు సూరాడ ,యుగంధర్ ,వంక ,రాజశేఖర్ ,ఎన్ ,రవికుమార్ ,చిన్నాన్న లక్షణరావులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని   ఈ సందర్భంగా యుగంధర్ చెప్పారు.ఆయన ప్రతిభకు గ్రామ పెద్దలు బడె తమ్మయ్య ,వాసుపల్లి ,కృష్ణ రావు ,కొండ శేఖర్ ,లు అభినందించారు.కొడుకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినందుకు తల్లి తండ్రులు  కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Name*
Email*
Comment*