ఇచ్ఛాపురం - వైజాగ్ ఎక్స్ ప్రెస్ - అక్టోబర్ 17
వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు కోళిగాం జడ్పి ఉన్నత పాఠశాలలో హెచ్ఎం నరేంద్రకుమార్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గురువారం పాఠశాల ఆవరణలో వాల్మీకి చిత్రపటానికి హెచ్ఎం పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, వాణి రేణుక, అమిత, స్వప్న రాణి, పీతాంబర్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్ విశ్వనాథం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల మైదానంలో విద్యార్థులకు వాల్మీకి చరిత్ర తెలియపరిచారు.