ప్రగతి కోసమే పల్లె పండగ

10/18/2024 1:14:22 AM

 తాళ్లబద్ర లో సిసి రోడ్లకు శంకుస్థాపన

సోంపేట- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17: 

పల్లెల్లో అభివృద్ధిని కాంక్షిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ,సోంపేట మాజీ జెడ్పీటీసీ సభ్యులు సూరాడ చంద్రమోహన్ అన్నారు.  మండలంలోని తాళ్లబద్ర లో సిసి రోడ్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్టోబ‌ర్ 14 నుంచి 20 వ‌ర‌కు 7 రోజుల పాటు జ‌రిగే వారోత్స‌వాలు నిర్వహించనున్నామన్నారు. గ్రామాల్లో నివాసం ఉంటున్న కుంటుంబాల‌కు ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి, మెరుగైన జీవనోపాధి కల్పన చేశామ‌ని వివరించారు. ప‌ల్లెపండ‌గ‌- పంచాయ‌తీ వారోత్స‌వాలు జ‌రుగనున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం 15వ ఆర్థిక సంఘ నిధుల‌ను విడుద‌ల చేసిందని తెలిపారు. గత వైసిపి పాలనలో ఐదేళ్లపాటు గ్రామీణ ప్రాంతాలు కనీస మౌలిక సదుపాయాలుకు నోచుకోక అద్వాన పరిస్థితికి చేరుకుందన్నారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత్తు, రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోకపోవడంతో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు అన్నారు. పల్లెలకు పూర్వ వైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని  వివరించారు. నియోజకవర్గానికి సంబంధించి 32 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు ఇతర పనులు చేపట్టనున్నట్టు వివరించారు. ఆగస్టు 23న నిర్వహించిన గ్రామసభల్లో గుర్తించిన పనులను త్వరితగదన పూర్తి చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనుల్ని చేపట్టనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో సోంపేట ఎంపిడివో ఈశ్వరమ్మ , మాజీ ఎంపిటిసి బిన్నళ జగన్నాధం ,ఉగ్రపల్లి మాధవరావు ,బూరగాన ,మాధవరావు  , కృష్ణా రావు ,శివస్వామి ,కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Name*
Email*
Comment*