- జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పాడేరు- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎంప్లాయిస్ కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకనుండి ప్రతి మూడవ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ నిర్వహిస్తామని, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది అధికారులు ఈ గ్రీవెన్స్ లో పాల్గొని వారి సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఆరోజు ఉదయం యధావిధిగా మీకోసం కార్యక్రమం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహిస్తామని కలెక్టర్ వివరించారు.