అనంతగిరి- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
భీంపోల్ పంచాయతీ సర్పంచ్ బీమ్మలమ ఆధ్వర్యంలో పల్లె పండుగ వేడుకలు జరిగాయి. సరియపల్లి రెవిన్యూ గ్రామానికి ఉపాధి హామీ పథకంలో పంట కాలువ నిర్మించడానికి 220మీ, పొడవు 1400000 లక్షల రూపాయలు గ్రాంట్ మంజూరు. అయినదని సర్పంచ్ బీమలమ తెలిపారు త్వరలో పనిని పూర్తి చెయ్యాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అశోక్ వార్డ్ సభ్యులు కుమారి, లక్ష్మణ, సింహాచలం కూటమి నాయకులు సింహాచలం రైతులు సచివాలయం సిబ్బంది, కొండలరావు పాల్గొన్నారు.