ముంచంగిపుట్టు- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
మండలంలో గల పనసపుట్టు పంచాయతీ కేంద్రంలో పనసపుట్టు గ్రామంలో సర్పంచ్ జనం నోయిన ఆధ్వర్యంలో పల్లె పండుగ పురస్కరించుకొని గురువారం ఖండిత కాలువ పనులకు పూజా కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నోయినా మాట్లాడుతూ గ్రామంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో ఖండిత కాలువ పనులు ప్రారంభించామని ఆమె అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పనులు చేపడతామని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ సిబ్బంది, వైసీపీ నేత జనం తిరుపతి రావు, టిడిపి మండల కార్యదర్శి కొంతేరి జగత్ రాయ్, సచివాలయ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.