ముంచంగిపుట్టు- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
ముంచంగిపుట్టు మండలం దారెల పంచాయతీ పెద్దపేట గ్రామానికి ఆనుకొని ఉన్న మత్స్య గెడ్డలో నాటు పడవ ప్రమాదంలో కోర్ర వేణుగోపాలస్వామి (25) గల్లంతయ్యారు. స్థానిక ఎస్సై కే రవీంద్ర మండల తహసీల్దార్ నర్సమ్మ తెలిపిన వివరాల ప్రకారం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ రోగులపేట గ్రామానికి చెందిన మృతుడు వేణుగోపాల స్వామి పనిముట్లు పదును పట్టించేందుకు పెద్దపేట గ్రామానికి తీసుకొని వెళుతుండగా మత్స్యగేడ్డ మధ్యలో నాటు పడవ మునిగి మృతి చెందాడు. సమాచారం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకుని ఎస్సై తహసీల్దార్ ల ఆధ్వర్యంలో మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలుపుదల చేసి శుక్రవారం మరల యధావిధిగా గాలింపు చర్యలు చేపడతామని తెలియజేశారు . మృతుడు వ్యవసాయ పనిముట్లను పదును చేయించుకునేందుకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో స్వగ్రామమైన రోగులపేట గ్రామం నుండి నాటు పడవ సహాయంతో పెద్ద పేట గ్రామానికి వెళుతున్న తరుణంలో మత్స్యగెడ్డ మధ్యలో నాటు పడవ మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య కలిగి ఉన్నాడు దీంతో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండడంతో అగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.