ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో గ్రామాల అభివృద్ధి

10/18/2024 1:51:01 AM


ముంచంగిపుట్టు- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17: 
కూటమి ప్రభుత్వం ఏర్పడి గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ గ్రామసభల్లో అభివృద్ధి పనులను తీర్మానించి పల్లె పండుగ కార్యక్రమంతో శ్రీకారం చుట్టిందన్నారు.గురువారం కొత్తూరు గ్రామంలో ఎంజిఎన్ఆర్ఈజీఎస్ పథకం నిధులు 4లక్షల 84 వేల తో ఎంపీడీవో శ్రీ సాయి హర్ష, సర్పంచ్ వి లక్ష్మణ్ లు ఖండిత కందకాలు, భూమి చదువును, మొక్కలు నాటి పూజా కార్యక్రమంతో ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మండల పరిధి వనభసింగి పంచాయతీ కొత్తూరు గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకం కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పించి వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా భూమి చదును, ఖండిత కందకాలు, పనులు ప్రారంభించామన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన, మంచినీటి సౌకర్యం ప్రతి ఇంటింటికి కులాయి, సీసీ రోడ్లు,అందించే దిశగా ముందడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఏపీవో నాయుడు పంచాయతీ సెక్రెటరీ,ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, జి తిరుపతిరావు, వీఆర్పీ మాల్లన్న లతో పాటు మండల టిడిపి అధ్యక్షులు కే బలరాం, ఉపాధ్యక్షులు ఎస్ బాబుజీ రావు,బిజెపి మండల అధ్యక్షులు, వి లక్ష్మణ్, మండల క్లస్టర్ ఇంచార్జి మజ్జి.చిన్నిబాబు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*