ముంచంగిపుట్టు- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం అర్హులైన ఉపాద్యాయులు విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఏపిటిఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శిలు గల్లేల కామేశ్వరరావు. రామన్నలు కోరారు. ముంచింగిపుట్టు మండలంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్ఫీ ఓటర్ నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని ఎపిటిఎఫ్ సంఘం నేతలు గురువారం నిర్వహించారు. జోలాపుట్టు, లబ్బూరు. పనసపుట్టు తదితర గ్రామాల్లో ఎపిటిఎఫ్ సంఘం నేతలు, ఉపాద్యాయులు పర్యటించి అర్హత గల ఉపాద్యాయుల నుంచి ఓటు నమోదు ప్రక్రియను చేపట్టారు. మండలంలో ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ టీచర్లు త్వరితగతిన తమ ఓటు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్ మండల నేతలు మఠం కొండపడాల్, ఉపాధ్యాయులు మాణిక్యాలరావు, ధనుంజయరావు, టి రామన్న, ఆర్.శేఖర్. ఎస్.నారాయణ తదితరులు పాల్గోన్నారు.