తెదేపా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు భూషణం.
చింతపల్లి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
చింతపల్లి ఆసుపత్రిలో రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని తెదేపా బీసీ సెల్ లో ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యులు ఉన్నప్పటికీ రోగులకు సకాలంలో సరైన వైద్యం అందడం లేదన్నారు. ఎముకలు విరిగి ఆసుపత్రికి వచ్చిన, అదేవిధంగా వివిధ సమస్యలతో వచ్చిన రోగులను వెంటనే జిల్లా కేంద్రమైన పాడేరు, ఉమ్మడి జిల్లా కేంద్రమైన విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలిస్తూ స్థానిక వైద్యులు చేతులు దులుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి స్థానిక ఆసుపత్రిలో మత్తు వైద్యులను నియమించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.