కారు బోల్తా పడి ఒకరు మృతి

10/18/2024 1:56:12 AM

అదుపుతప్పి పొలాల్లో దూసుకెళ్లిన కారు
ఒకరు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

ముంచంగిపుట్టు- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17: 
అసరాడ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి పొలాల్లో దూసుకుపోయి బోల్తా పడింది. ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు మృతిచెందగా మిగతా ముగ్గురు తీవ్రగాయలతో బయటపడ్డారు. వివరాల్లోకెళితే స్థానికులు అందించిన వివరాల ప్రకారం మండలంలో పోలిపుట్టు నుండి ఆసరడ మీదుగా డుడుమ వైపు వెళుతున్న ఓడి 10 బి7622 నంబరు గల కారు బ్రేకులు పనిచేయకపోవడంతో తర్లగూడ మలుపు వద్ద ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను ఆస్పత్రిలో తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. మృతుడు గోనియ ఉమా గా గుర్తించారు. వీరు ఒరిస్సా రాష్ట్రం బోయపరిగూడ వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

Name*
Email*
Comment*